వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టుకుని కూర్చున్న మిచెల్ మార్ష్... సర్వత్రా ఆగ్రహం
- వరల్డ్ కప్ నెగ్గిన ఆస్ట్రేలియా జట్టు
- ఆసీస్ డ్రెస్సింగ్ రూంలో మిన్నంటిన సంబరాలు
- వరల్డ్ కప్ పట్ల అమర్యాదగా ప్రవర్తించిన మార్ష్
- ఫొటో పంచుకున్న ఆసీస్ సారథి కమిన్స్
ఆసీస్ జట్టు వరల్డ్ కప్ గెలిచాక వాళ్ల డ్రెస్సింగ్ రూంలో సంబరాలు మామూలుగా లేవు! బీర్లు పొంగిపొర్లినట్టు సమాచారం! పలు ఫొటోల్లో ఆసీస్ ఆటగాళ్ల చేతుల్లో బీరు సీసాలు దర్శనమిచ్చాయి. అయితే అన్నిటికంటే ఒక ఫొటో అందరి ఆగ్రహావేశాలకు కారణమైంది. అది మిచెల్ మార్ష్ ఫొటో.
చేతిలో మినీ బీరు సీసాతో ఉన్న మార్ష్... ఎదురుగా వరల్డ్ కప్ ట్రోఫీని పెట్టుకుని దానిపై కాళ్లు బారజాపి కూర్చోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మరీ అంత కండకావరం పనికిరాదని, మార్ష్ ఎంతటి అహంకారంతో ఉన్నాడో స్పష్టంగా తెలుస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఐసీసీ ట్రోఫీకి ఎంతో గౌరవం అంటుందని, అలాంటి ట్రోఫీ పట్ల మార్ష్ అమర్యాదకరంగా వ్యవహరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీ చర్య పట్ల సిగ్గుపడుతున్నాం మిచెల్ మార్ష్ అంటూ తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు.
ఇంకెవరైనా ఈ ఫొటోను పోస్టు చేసి ఉంటే ఇది ఫేక్ ఫొటో అయ్యుండొచ్చని భావించేవాళ్లు. కానీ ఈ ఫొటో షేర్ చేసింది సాక్షాత్తు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్. కమిన్స్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో మార్ష్ ఫొటోను పొందుపరిచాడు. దాంతో ఇది వైరల్ అయింది.