టీమిండియా-న్యూజిలాండ్ సెమీస్ కు అంపైర్లను ప్రకటించిన ఐసీసీ
- చివరి దశకు చేరిన వరల్డ్ కప్
- ఈ నెల 15, 16 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్ లు
- ఈ నెల 19న ఫైనల్
- తొలి సెమీఫైనల్లో టీమిండియా, న్యూజిలాండ్ ఢీ
వీరోచిత ప్రదర్శనలు, ఆశ్చర్యానికి గురిచేసే బ్యాటింగ్ విన్యాసాలు, ఆకట్టుకునే బౌలింగ్ ప్రదర్శనలు, అనేక రికార్డులకు వేదికగా నిలిచిన వరల్డ్ కప్ లో నిన్నటితో లీగ్ దశ ముగింది. ఇక ఈ మెగా టోర్నీలో రెండు సెమీఫైనల్ మ్యాచ్ లు, ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలాయి.
ఈ నెల 15, 16 తేదీల్లో సెమీస్ మ్యాచ్ లు, ఈ నెల 19న ఫైనల్ నిర్వహించనున్నారు. ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో జరిగే తొలి సెమీఫైనల్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడుతుండగా... రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి.
కాగా, టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ కు ఐసీసీ అంపైర్లను ప్రకటించింది. రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ (ఇంగ్లండ్), రాడ్ టకర్ (ఆస్ట్రేలియా) తొలి సెమీఫైనల్లో అంపైర్లుగా వ్యవహరిస్తారని ఐసీసీ వెల్లడించింది. ఇక, వెస్టిండీస్ కు చెందిన జోయెల్ విల్సన్ థర్డ్ అంపైర్ గానూ, దక్షిణాఫ్రికాకు చెందిన ఆడ్రియన్ హోల్డ్ స్టాక్ ఫోర్త్ అంపైర్ గానూ వ్యవహరిస్తారని వివరించింది.
జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్ ఈ తొలి సెమీఫైనల్ కు మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తారని ఐసీసీ తెలిపింది.