సచిన్ ఏం చెప్పాడో కానీ... ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన జాద్రాన్, రషీద్!
- ముంబయి వాంఖెడే స్టేడియంలో ఆఫ్ఘన్ భారీ స్కోరు
- నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 291 పరుగులు
- ఓపెనర్ గా వచ్చి 129 పరుగులతో నాటౌట్ గా నిలిచిన జాద్రాన్
- 18 బంతుల్లో 35 పరుగులు చేసిన రషీద్ ఖాన్
- స్టార్క్, కమిన్స్ లను ఏమాత్రం లెక్కచేయకుండా ఆడిన ఆఫ్ఘన్లు
తనకంటే ఎంతో పెద్ద జట్టయిన ఆస్ట్రేలియాతో ఆడుతున్నప్పటికీ ఆఫ్ఘనిస్థాన్ ఏ మాత్రం బెదురు లేకుండా బ్యాటింగ్ చేసింది. ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో ఆసీస్ తో వరల్డ్ కప్ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 291 పరుగులు చేసింది.
ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ అజేయ సెంచరీతో విరుచుకుపడగా, రషీద్ ఖాన్ మెరుపుదాడి చేశాడు. జాద్రాన్ 143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 129 పరుగులు చేయడం ఈ ఇన్నింగ్స్ లో హైలైట్ గా నిలిచింది. మహ్మద్ నబీ అవుట్ కావడంతో బరిలో దిగిన రషీద్ ఖాన్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. రషీద్ ఖాన్ కేవలం 18 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సులతో 35 పరుగులు చేశాడు.
ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే... మిచెల్ స్టార్క్ వంటి అగ్రశ్రేణి బౌలర్ ను కూడా రషీద్ ఏమాత్రం లెక్కచేయకుండా ఉతికారేశాడు. జాద్రాన్ సైతం ఆఖరి ఓవర్లలో ధాటిగా ఆడడంతో ఆఫ్ఘన్ జట్టుకు భారీ స్కోరు లభించింది. చివరి 5 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయిన ఆఫ్ఘనిస్థాన్ 64 పరుగులు సాధించడం చెప్పుకోదగ్గ అంశం.
ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 21, రహ్మత్ షా 30, కెప్టెన్ హష్మతుల్లా షాహిది 26, అజ్మతుల్లా ఒమర్జాయ్ 22 పరుగులు చేసి తమ వంతు సహకారం అందించారు. నిన్న క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఆఫ్ఘన్ క్యాంప్ ను సందర్శించి ఏం చెప్పాడో ఏమో కానీ, ఇవాళ ఆసీస్ వంటి బలమైన బ్యాటింగ్ లైనప్ ను ఎదుర్కోవడంలో ఆఫ్ఘన్ బ్యాటర్లు ఎంతో పట్టుదల కనబరిచారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వికెట్ అప్పగించకూడదన్న కసి వాళ్ల బ్యాటింగ్ లో ప్రతిఫలించింది.
ఆసీస్ బౌలర్లలో హేజెల్ వుడ్ 2, మిచెల్ స్టార్క్ 1, మ్యాక్స్ వెల్ 1, ఆడమ్ జంపా 1 వికెట్ తీశారు.