ఆఫ్ఘనిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది: విరేంద్ర సెహ్వాగ్

  • నిన్నటి శ్రీలంకతో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఘన విజయం
  • దిగ్గజాలను వరుసగా మట్టికరిపిస్తున్న ఆఫ్ఘన్ క్రికెటర్లపై ప్రశంసలు
  • అతి తక్కువ సమయంలో మెరుగుపడ్డ టీం ఆఫ్ఘనిస్థాన్ అంటూ సెహ్వాగ్ ప్రశంసలు
వరల్డ్ కప్‌లో అసాధారణ పోరాటపటిమతో దిగ్గజ టీంలను బెంబేలెత్తిస్తున్న ఆఫ్ఘనిస్థాన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. మాజీ క్రికెటర్ విరేంద్ర సెహ్వాగ్‌ కూడా ఆప్ఘనిస్థాన్‌ క్రీడా స్ఫూర్తికి ముగ్ధుడయ్యాడు. ఆఫ్ఘన్ టీంను ప్రశంసిస్తూ సెహ్వాగ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

‘‘ వావ్.. ఆఫ్ఘనిస్థాన్‌.. భలే ప్రదర్శన. ఆఫ్ఘనిస్థాన్ క్రీడాస్ఫూర్తి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. బంగ్లాదేశ్ 25 సంవత్సరాలుగా అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆడుతోంది కానీ ఆఫ్ఘనిస్థాన్‌లా వరుసగా దిగ్గజాలను ఓడించిన దాఖలాలు లేవు. తక్కువ సమయంలోనే ఆఫ్ఘన్లు తమని తాము బాగా మెరుగుపరుచుకున్నారు’’ అని కామెంట్ చేశారు. నిన్న పూణె వేదికగా జరిగిన మ్యాచ్‌లో మేటి జట్టు శ్రీలంకపై ఆఫ్ఘనిస్థాన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.


More Telugu News