భారత్ ఓటమి కోరుతూ పాకిస్థాన్ వివాదాస్పద నటి మరో సంచలన ట్వీట్

  • ఎన్ని కోరికలు కోరుతున్నా పాకిస్థాన్ నటికి తీరని ఆవేదన
  • భారత్ జట్టు ఓటమిని కోరుకుంటున్న షెషర్ షిన్వారీ
  • దీనిపై తాజాగా న్యూజిలాండ్ బ్యాట్స్ మ్యాన్ కు సూపర్ ఆఫర్
వివాదాస్పద స్టేట్ మెంట్లతో వార్తల్లో తరచూ వినిపించే పాకిస్థాన్ నటి షెషర్ షిన్వారీ మరోసారి భారత్ ఓటమిని కోరుకుంటోంది. ఇప్పటికీ ఈ విషయంలో ఎన్నో సార్లు బోల్తా పడినా , ఈ అమ్మడికి భారత్ జట్టు అదే పనిగా భారత్ ఓటమి కోసం ప్రార్థించడమే ఏకైక పనిగా పెట్టుకున్నట్టుంది. తాజాగా భారత్ జట్టుని ఓడించాలంటూ న్యూజిలాండ్ జట్టుకు భలే ఆఫర్ ఇచ్చింది. దీనిపై ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసింది. 

‘‘హే జిమ్మీ నీష్ (జేమ్స్ నీషామ్) నీవు భారత జట్టును ఓడిస్తే గనుక, మేము పాకిస్థానీలం నిన్ను తదుపరి ప్రధానిగా ఎన్నుకుంటాం’’అంటూ ఓ కామెడీ ట్వీట్ చేసింది. అసలు భారత్ తో ఆదివారం తలపడే న్యూజిలాండ్ టీమ్ లో జేమ్స్ నీషామ్ లేనే లేడనుకోండి. అయినా షెహర్ కు ఇలాంటి పరాభవాలు కొత్తేమీ కాదు. అందుకే ఈ నటిని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. 

షిన్వారీ తరచూ పాకిస్థాన్ జట్టు పట్ల ఎఅతి విశ్వాసం వ్యక్తం చేస్తుంటుంది. భారత్ చేతిలో పాక్ జట్టు ఓటమిని అస్సలు జీర్ణించుకోలేదు. పాకిస్థాన్ క్రికెట్ జట్టును నమ్ముకుని కొన్ని సందర్భాల్లో చాలా పెద్ద హామీలు, చాలెంజ్ లు సైతం చేసింది. వన్డే ప్రపంచకప్ 2023 సందర్భంగా షెహర్ షిన్వారీ చేసిన రెండు అంచనాలు ఇప్పటికే బెడిసికొట్టాయి. అయినా కానీ, ఆమె మరో సవాల్ తో ముందుకు వచ్చింది.

‘‘పాకిస్థాన్ శుక్రవారం రోజున ఎప్పుడు ఓటమిని ఎరుగదు’’ ఇదీ ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య గత శుక్రవారం మ్యాచ్ సందర్భంగా షిన్వారీ చేసిన ట్వీట్. పైగా నా ట్వీట్ ను గుర్తుంచుకోండంటూ, పాకిస్థాన్ గెలుపు ఖాయమని బల్లగుద్దినట్టు చెప్పింది. కానీ ఏమైంది? ఆస్ట్రేలియా చేతిలో పాక్ ఓటమి చూడక తప్పలేదు. గతంలోనూ భారత్ ను ఓడిస్తే ఏవేవో చేస్తానంటూ ఈ నటి ఆఫర్లు ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ లో భారత్ ను జింబాబ్వే ఓడిస్తే, జింబాబ్వే వాసిని పెళ్లాడతానని ప్రకటించింది.

అంతకుముందు భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర ఓటమితో రగిలిపోయిన ఈ అమ్మడు.. భారత్ ను బంగ్లాదేశ్ జట్టు ఓడిస్తే.. బంగ్లాదేశ్ జట్టులో ఒకరితో డేట్ చేస్తానంటూ సంచలన ప్రకటన చేసింది. పాపం అటు బంగ్లాదేశ్ గెలవనూ లేదు. ఇటు షిన్వారీ డేటింగ్ ముచ్చట తీరలేదు. దీంతో నెటిజన్లు ట్రోలింగ్ తో షిన్వారీ భరతం పడుతున్నారు.


More Telugu News