భర్తను అతడి ప్రియురాలికే రూ.5 లక్షలకు అమ్మేసిన గృహిణి!

  • కర్ణాటకలోని మాండ్యకు సమీపంలోని గ్రామంలో ఘటన
  • భర్త, ప్రియురాలితో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని నిలదీసిన భార్య 
  • తన వద్ద తీసుకున్న అప్పు చెల్లిస్తేనే అతడిని భార్యకు తిరిగిస్తానన్న ప్రియురాలు
  • తనకే రూ.5 లక్షలు ఇచ్చి అతడిని సొంతం చేసుకోమంటూ భార్య ఆఫర్
  • ఇద్దరి మధ్య కుదిరిన డీల్, అవాక్కైన గ్రామస్తులు 
సినిమా కథకు ఏమాత్రం తీసిపోని ఓ అసాధారణ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. ఓ మహిళ తన భర్తను అతడి ప్రియురాలికి రూ.5 లక్షలకు అమ్మేసింది. మాండ్యకు సమీపంలోని ఓ గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఇటీవల ఓ గృహిణి తన భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండటం గమనించింది. వారిదద్దరూ పడక గదిలో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా దొరకబుచ్చుకుని నిలదీసింది. 

ఈ క్రమంలో ఇద్దరు మహిళల మధ్యా తలెత్తిన వివాదం పంచాయతీకి చేరింది. గృహిణికి ఆమె భర్తను అప్పగించాలంటే తనకు అతడు బాకీ పడ్డ రూ.5 లక్షలు చెల్లించాలని ప్రియురాలు షరతు పెట్టింది. ఇలాంటి భర్త తనకొద్దన్న గృహిణి తనకే రూ.5 లక్షలు మనోవర్తి కింద ఇస్తే తన భర్తను ఆమెకు వదిలేసేందుకు సిద్ధమని చెప్పింది. ఈ మేరకు ఇద్దరూ ఓ అంగీకారానికి రావడంతో భర్త బదిలీ పూర్తయ్యింది. వారి మధ్య కుదిరిన ఒప్పందం చూసి గ్రామపెద్దలు, గ్రామస్థులు ఆశ్చర్యపోయారు.


More Telugu News