ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం... సౌదీ అరేబియా కీలక నిర్ణయం!
- ఇజ్రాయెల్‌తో సత్సంబంధాల కోసం ఉద్దేశించిన చర్చలకు సౌదీ అరేబియా బ్రేక్
- కొన్నేళ్లుగా అరబ్ లీగ్‌తో సన్నిహిత సంబంధాల కోసం ఇజ్రాయెల్ ప్రయత్నం
- సౌదీతో సత్సంబంధాలకు అమెరికా మధ్యవర్తిత్వం
- ఇజ్రాయెల్‌తో చర్చలను నిలిపివేసినట్లు అమెరికా అధికారులకు తెలిపిన సౌదీ
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఉద్దేశించిన ఒప్పంద చర్చలకు బ్రేక్ పడినట్లుగా మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్‌తో ఇందుకు సంబంధించిన చర్చలు నిలిపివేయాలని సౌదీ అరేబియా నిర్ణయించినట్లుగా అమెరికా అధికారులకు సౌదీ తెలిపినట్లుగా వార్తలు వచ్చాయి.
కొన్నేళ్లుగా అరబ్ లీగ్‌తో సన్నిహిత సంబంధాల కోసం ఇజ్రాయెల్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా 1979లో ఈజిప్ట్‌తో ఇటీవల యూఏఈ, బహ్రెయిన్ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇటీవల సౌదీతోను అలాంటి ఒప్పందానికి ప్రయత్నించింది. ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తోంది.
గాజా - ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి ఇది కూడా ఓ కారణమనే వాదనలు ఉన్నాయి. పాలస్తీనా సమస్య అరబ్ దేశాలకు ఓ భావోద్వేగ అంశం. అందుకే ఇజ్రాయెల్ సార్వభౌమత్వాన్ని గుర్తించేందుకు ముస్లిం దేశాలు చాలాకాలం తిరస్కరిస్తూ వచ్చాయి. అలాంటి ఇజ్రాయెల్‌తో ఇప్పుడు ఒప్పందాలను ఇరాన్ వంటి దేశం ఖండిస్తోంది.