సీఎం కేసీఆర్ లేటెస్ట్ ఫొటో వైరల్..నెట్టింట షేర్ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
- సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
- మహబూబ్‌నగర్ అభివృద్ధిపై రూపొందించిన పుస్తకం అందజేత
- ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా పంచుకున్న మంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతూ కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో, సగటు అభిమాని ఆయనను చూసి చాలా రోజులే అయిపోయింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ లేటెస్ట్ ఫొటో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా దీన్ని పోస్ట్ చేశారు.
తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధిపై పూర్తి సమాచారంతో రూపొందించిన ‘పాలమూరు ప్రగతి నివేదిక’ పుస్తకాన్ని సీఎంకు అందించారు. ఈ క్రమంలో దిగిన ఫొటోను ఎక్స్ వేదికగా మంత్రి షేర్ చేశారు.
ఇక, సీఎం కేసీఆర్ అక్టోబర్ 15 నుంచి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. హుస్నాబాద్‌లో జరిగే భారీ బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆ రోజు ఉదయం అభ్యర్థులతో సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం బీ ఫాం అందజేస్తారు.