తిరుమలకు విచ్చేసిన సీఎం కేసీఆర్ అర్ధాంగి కల్వకుంట్ల శోభ
- ఈ సాయంత్రం హైదరాబాద్ నుంచి రేణిగుంట చేరుకున్న కేసీఆర్ అర్ధాంగి
- రోడ్డు మార్గంలో తిరుమల పయనం
- రేపు వీఐపీ బ్రేక్ సమయంలో స్వామి వారి దర్శనం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అర్ధాంగి కల్వకుంట్ల శోభ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల విచ్చేశారు. హైదరాబాద్ నుంచి ఈ సాయంత్రం ఆమె రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల కొండపైకి చేరుకున్నారు. తిరుమల వచ్చిన కేసీఆర్ అర్ధాంగికి టీటీడీ ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
కల్వకుంట్ల శోభ ఈ రాత్రికి తిరుమలలోనే బస చేసి, రేపు (అక్టోబరు 10) వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకోనున్నారు. సీఎం కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే, కల్వకుంట్ల శోభ ఒక్కరే తిరుమలకు వచ్చినట్టు తెలుస్తోంది.