వరల్డ్ కప్: నెదర్లాండ్స్ కు భారీ టార్గెట్ నిర్దేశించిన కివీస్
- వరల్డ్ కప్ లో నేడు న్యూజిలాండ్ × నెదర్లాండ్స్
- హైదరాబాదులో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న డచ్ జట్టు
- 50 ఓవర్లలో 7 వికెట్లకు 322 పరుగులు చేసిన న్యూజిలాండ్
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన నెదర్లాండ్స్... కివీస్ కు బ్యాటింగ్ అప్పగించింది. దాంతో, తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 322 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఓపెనర్ విల్ యంగ్ (71), యువకెరటం రచిన్ రవీంద్ర (51), కెప్టెన్ టామ్ లాథమ్ (53) అర్ధసెంచరీలతో రాణించారు. చివర్లో మిచెల్ శాంట్నర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో కివీస్ స్కోరు 300 మార్కు దాటింది. శాంట్నర్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్ 2, పాల్ వాన్ మీకెరెన్ 2, వాన్ డెర్ మెర్వా 2, బాస్ డి లీడ్ 1 వికెట్ తీశారు.