నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన ఏపీ సీఎం వైఎస్ జగన్

  • ఢిల్లీ పర్యటనలో వరుసగా కేంద్రమంత్రులను కలుస్తోన్న జగన్
  • విద్యుత్ బకాయిలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశంపై చర్చ!
  • రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో వరుసగా కేంద్రమంత్రులను కలిశారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను కలిశారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, పోలవరం నిధులు తదితర అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.

భేటీ సమయంలో జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి ఉన్నారు. నిర్మలా సీతారామన్‌కు జగన్ శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు. కాగా, రేపు ఉదయం విజ్ఞాన్ భవన్‌లో వామపక్ష తీవ్రవాద నిర్మూలనపై జరగనున్న సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీకి వచ్చారు. ఈ క్రమంలో కేంద్రమంత్రులతోనూ భేటీ అవుతున్నారు. రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు.


More Telugu News