బ్రహ్మోత్సవాలకు రావాలంటూ సీఎం జగన్ ను ఆహ్వానించిన టీటీడీ

  • అధికమాసం కారణంగా ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు
  • సెప్టెంబరు 18 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
  • సీఎం జగన్ ను కలిసిన భూమన, ధర్మారెడ్డి తదితరులు
ఈసారి అధికమాసం కారణంగా తిరుమల పుణ్యక్షేత్రంలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. తొలుత సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరపాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రావాలంటూ సీఎం జగన్ ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆహ్వానించారు. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను భూమన, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, అర్చకులు కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు. సీఎం జగన్ కు శేష వస్త్రం కప్పి వేదాశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర  దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.


More Telugu News