బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువ విద్యుత్ లోటు ఉంది: కేటీఆర్

  • 2013-14లో తెలంగాణ విద్యుత్ లోటుతో ఉందన్న కేటీఆర్
  • ఇప్పుడు మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రమని వ్యాఖ్య
  • రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని వెల్లడి
కాంగ్రెస్, బీజేపీలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువ విద్యుత్ లోటు ఉందని ఎద్దేవా చేశారు. 2013-14లో తెలంగాణ విద్యుత్ లోటులో ఉందని... ఇప్పుడు మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రమని చెప్పారు. తలసరి విద్యుత్ వినియోగంలో కూడా తెలంగాణ తొలి స్థానంలో ఉందని తెలిపారు. రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణను తమ ప్రభుత్వం అన్ని విధాలుగా డెవలప్ చేసిందని... తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శమని చెప్పారు.


More Telugu News