ఎంతకీ తగ్గని వాన... భారత్, పాక్ మ్యాచ్ రద్దు
- పల్లెకెలెలో భారత్ × పాకిస్థాన్
- ఆసియా కప్ లో గ్రూప్-ఏ సమరం
- టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్
- 48.5 ఓవర్లలో 266 ఆలౌట్
- ఇన్నింగ్స్ విరామం నుంచి ఎడతెరిపి లేని వర్షం
- ఫలితం తేలకుండానే ముగిసిన మ్యాచ్
శ్రీలంకలోని పల్లెకెలెలో భారత్, పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసింది. టీమిండియా ఇన్నింగ్స్ ముగిశాక మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రెండు పర్యాయాలు అడ్డు తగిలిన వర్షం... పాక్ ఇన్నింగ్స్ కు ముందు జోరుగా కురిసింది. అప్పటికి మైదానంలో నీళ్లు చేరాయి. ఎడతెరిపి లేని వర్షంతో మైదానాన్ని మ్యాచ్ కు సిద్ధం చేసేందుకు సిబ్బందికి అవకాశం లభించలేదు. దాంతో పాక్ జట్టు కనీసం ఒక్క బంతి కూడా ఆడకుండానే మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయింది.
ఈ మ్యాచ్ లో ఫలితం తేలకపోవడంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఇక, భారత జట్టు తన తదుపరి మ్యాచ్ ను సెప్టెంబరు 4న నేపాల్ జట్టుతో ఇదే మైదానంలో ఆడనుంది.