ఇస్రోకు థ్యాంక్స్ చెప్పిన ‘పెటా’.. కానుకగా స్పెషల్ కేక్

  • వెగాన్ కేక్ ను పంపించిన పెటా
  • బెంగళూరులోని వెగాన్ బేకరీ క్రేవ్ తయారీ కేకు 
  • గగన్ యాన్ ప్రాజక్టు పరీక్షలకు జంతువులను వినియోగించకూడదని నిర్ణయించడం పట్ల హర్షం 
చంద్రుడిపైకి విజయవంతంగా ల్యాండ్ రోవర్ ను పంపించి, చంద్రయాన్-3 ప్రాజెక్ట్ ను విజయవంతం చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)పై అభినందనల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా జంతు సంరక్షణ సంస్థ (పెటా) సైతం ఈ జాబితాలోకి చేరిపోయింది. ఇస్రోకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసింది. పెటా ఇండియా ఈ మేరకు ఎక్స్ ప్లాట్ ఫామ్ పై ఒక పోస్ట్ ను సైతం పెట్టింది.

గగన్ యాన్ ప్రాజెక్టులో భాగంగా రోదసీలోకి జంతువులను పంపకుండా, రోబోని పంపాలని ఇస్రో నిర్ణయం తీసుకున్నందుకు పెటా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసింది. పరీక్షల కోసం జంతువులను వాడుకోకపోవడం పట్ల సంతోషిస్తూ ఇస్రోకి ఒక కేక్ ను పంపించింది. ఇది చంద్రయాన్ రాకెట్ ఆకారంతో ఉంది. దీన్ని బెంగళూరులోని వెగాన్ బేకరీ క్రేవ్ తయారు చేసింది. పెటా ఇండియా ఈ రోజు పంపించిన ఈ వెగాన్ కేక్ ను ఇస్రో ఇష్టపడుతుందని ఆశిస్తున్నట్టు పెటా పేర్కొంది.


More Telugu News