తెలంగాణ నూతన సచివాలయంలో ఆలయం, చర్చి, మసీదు... ఈ నెల 25న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

  • వేసవిలో ప్రారంభోత్సవం జరుపుకున్న కొత్త సెక్రటేరియట్
  • సెక్రటేరియట్ ప్రాంగణంలో ఆలయం, చర్చి, మసీదు నిర్మాణం
  • గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి నిదర్శనమన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి 
ఈ ఏడాది ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ సెక్రటేరియట్ నిర్మాణాన్ని చేపట్టింది. ఎంతో కళాత్మకంగా, అన్ని సదుపాయాలతో రూపుదిద్దుకున్న కొత్త సచివాలయంలో మరొక ఆశ్చర్యకరమైన అంశం కూడా ఉంది. 

ఈ సచివాలయం ప్రాంగణంలో దేవాలయం, చర్చి, మసీదు నిర్మించడం విశేషం. ఈ మూడు ప్రార్థన మందిరాలను సీఎం కేసీఆర్ ఆగస్టు 25న ప్రారంభించనున్నారు. దీనిపై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. 

నూతన సచివాలయంలో మూడు మందిరాలు గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి ప్రతీక అని అభివర్ణించారు. కాగా, ఇక్కడి ఆలయంలో శివుడు, గణపతి, పోచమ్మ తల్లి విగ్రహాలు ఉంటాయని తెలిపారు. వీటిని ప్రత్యేకంగా తిరుపతి నుంచి తెప్పించామని వెల్లడించారు. మసీదు, చర్చి ప్రారంభోత్సవం ఆయా మతగురువుల సమక్షంలో జరుగుతుందని వివరించారు.


More Telugu News