కొండ మీద దేవుడు ఉండాలి... రుషికొండపై నువ్వు ఉండడానికి ఒప్పుకోను: సీఎం జగన్ పై పవన్ ఫైర్

  • గాజువాకలో పవన్ కల్యాణ్ బహిరంగ సభ
  • భారీగా తరలివచ్చిన జనాలు
  • వాడీవేడిగా ప్రసంగించిన జనసేనాని
  • తాను పూర్తిగా మంగళగిరికి షిఫ్ట్ అయ్యానని వెల్లడి
  • జగన్ ఒక క్రిమినల్ అంటూ వ్యాఖ్యలు
గాజువాక సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  మీరు అరిస్తే భయపడను, మీరు తిడితే వెనక్కి వెళ్లను... నేనొక మొండి మనిషిని... ఒక విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో నీకు రోజూ చూపిస్తాను అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి హెచ్చరించారు. 

జగన్ తన రూ.300 కోట్ల ఆస్తులు కాపాడుకోవడం కోసం లక్ష కోట్ల విలువైన ప్రజల ఆస్తులను వదిలేసి తెలంగాణ నుంచి వచ్చేశాడని విమర్శించారు. తాను పూర్తిగా మంగళగిరికి షిఫ్ట్ అయ్యానని, విశాఖను తన రెండో ఇల్లుగా మార్చుకుంటానని తెలిపారు. ఇకపై ప్రజలకు అండగా ఉంటాను అని వ్యాఖ్యానించారు.

గాజువాక సభలో పవన్ ప్రసంగం హైలైట్స్...

  • విశాఖ వస్తే నాకు స్టీల్ ప్లాంట్ అంశం గుర్తుకు వస్తుంది. నాడు స్టీల్ ప్లాంట్ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 30 మంది వరకు ప్రాణత్యాగాలు చేశారు. ఇది రాష్ట్రానికి గుండెకాయ వంటి పరిశ్రమ.
  • 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిని ఎంపీగా గెలిపించి ఉంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునేవాళ్లం.
  • రాజకీయాల్లో ఓటమిని స్వీకరించలేనివాళ్లు, ఒక్క ఓటమికి భయపడేవాళ్లు రాజకీయాల్లోకి రావొద్దు. 
  • విశాఖ ఎంపీగా మీరు గెలిపించిన ఎంవీవీ సత్యనారాయణ ఒక రౌడీషీటర్. అతను కనీసం పార్లమెంటులో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేకపోయాడు. 
  • ఒక రౌడీషీటర్ ను ఎంపీగా గెలిపిస్తే క్రిస్టియన్ భూములు దోచుకుంటున్నారు.
  • కేసులు ఉన్నవారికి, గూండాలకు, దోపిడీదారులకు ప్రధానిని అడిగే దమ్ము లేదు.
  • జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర నాయకుల కాళ్ల మీద పడితే, అడుక్కుంటే అప్పుడు కేంద్రం మొన్న రూ.10 వేల కోట్లు ఇచ్చింది. 
  • నిజంగా నిజాయతీపరులు, అక్రమ మైనింగ్ చేయని 30 మంది ఎంపీలు ఉంటే... ఎందుకు కేంద్రాన్ని అడగలేకపోతున్నారు? అదే సమయంలో ఒడిశా, తమిళనాడు వంటి రాష్ట్రాలు వారి హక్కులు సాధించుకుంటున్నాయి. 
  • ఇవాళ ప్రజలు రోడ్డు మీదికి వచ్చిన అంశాన్ని కచ్చితంగా ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి పరిగణనలోకి తీసుకుంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో నేను మాట్లాడతాను. 
  • ఈసారి ఎన్నికల్లో డబ్బుతో ప్రమేయం లేకుండా మాకు అండగా ఉండండి... మీకోసం నేను నిలబడతాను. కచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. 
  • స్వార్థం లేకుండా ప్రజల కోసం మాట్లాడితే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తప్పకుండా వింటారు. 
  • విశాఖ వచ్చిన ప్రధాని ఏ పదవి లేని నన్ను పిలిచి మాట్లాడారు.
  • తమిళనాడులోని సేలం స్టీల్ ప్లాంట్ అంశంపై అన్ని పార్టీలు పోరాడి ప్రైవేటీకరణను అడ్డుకున్నాయి. ఇక్కడ మనం ఆ పని ఎందుకు చేయలేం?
  • వచ్చే దారిలో వైఎస్ విగ్రహం చూస్తే మత్స్యకారుడిని కాల్చి చంపించిన వ్యక్తి విగ్రహంలా అనిపించింది.
  • మత్స్యకార గ్రామాలను ధ్వంసం చేసి, మీ నాన్న హయాంలో తూటాలతో ఒక మత్స్యకారుడ్ని చంపి గంగవరం పోర్టు-2 కట్టారు జగన్.
  • గంగవరం బాధితులకు ఏమీ చేయలేని నువ్వు రాజధానిని విశాఖకు మార్చి ఏం చేస్తావ్ జగన్? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు?
  • పెందుర్తిలో వాలంటీర్ చేసిన దారుణం చూశారు. నేను వాలంటీర్ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపితే అందరూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. కానీ ఆ హత్యకు ఎవరు బాధ్యత తీసుకుంటారు?
  • ఇంతకీ వాలంటీర్ల అధిపతి ఎవరు? ముఖ్యమంత్రి జగనా? ఎమ్మెల్యేనా? చీఫ్ సెక్రటరీనా? అనేదానికి వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ సమాధానం రాలేదు. 
  • సినిమాల్లో నటించడం ఆపేందుకు నేను సిద్ధమే. కానీ నాకు మరో సంపాదన లేదు. అందుకు కొంచెం సమయం సినిమాలకు కేటాయిస్తున్నాను. సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో, కొంతమంది ఇచ్చిన విరాళాలతో పార్టీ నడుపుతున్నాను. అంతేతప్ప, ఏ దోపిడీలు చేసి సంపాదించడంలేదు.
  • జగన్ ను గద్దె దించేందుకు ప్రజలు వస్తున్నారు. జగన్ ఇక సింహాసనం ఖాళీ చేసి పులివెందుల ఎస్టేట్ కు వెళ్లిపో.
  • దేశానికి కావాల్సింది నిజాయతీపరులైన నేతలు. కానీ వేల కోట్లు ఉన్న సీఎం జగన్ ప్రధాని మోదీ దగ్గర మోకరిల్లి కూర్చుంటాడు. ఒక చేతగానివాడ్ని, నేరస్తుడ్ని ఎన్నుకుంటే ఇలాగే ఉంటుంది. 
  • వివేకాను చంపి ఆ కేసు తమ మీదకు, తమ కుటుంబం మీదకు రాకూడదని కాళ్లు పట్టుకుంటే, ఇక రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏం మాట్లాడతాడు?
  • నువ్వు క్రిమినల్ వి జగన్. 
  • కొండ మీద ఉండాల్సింది దేవుడు... క్రిమినల్ కాదు. రుషికొండపై జగన్ వంటి క్రిమినల్ ఉండడానికి నేను ఒప్పుకోను. 



More Telugu News