లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన బీఆర్ఎస్

  • ఈరోజు ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు
  • లోక్ సభ సెక్రటరీ జనరల్ కు వాయిదా తీర్మానం ఇచ్చిన నామా నాగేశ్వరరావు
  • మణిపూర్ హింసాకాండపై మోదీ ప్రకటన చేయాలని బీఆర్ఎస్ డిమాండ్
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన పార్లమెంటు సభ్యులకు నివాళి అర్పించిన తర్వాత ఇరు సభలు మధ్నాహ్నానికి వాయిదా పడ్డాయి. మరోవైపు మణిపూర్ అల్లర్లపై లోక్ సభలో బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. లోక్ సభ సెక్రటరీ జనరల్ కు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఈ తీర్మానాన్ని ఇచ్చారు. మణిపూర్ హింసాకాండపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని తీర్మానంలో బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. 

మరోవైపు మణిపూర్ హింసపై ట్విట్టర్ ద్వారా కేటీఆర్ స్పందిస్తూ... మణిపూర్ హింస అంశాన్ని పార్లమెంటు ఉభయసభల్లో బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తుతారని చెప్పారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించాలని డిమాండ్ చేస్తారని అన్నారు. మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.


More Telugu News