చీరకట్టులో సముద్రంపై మహిళ సాహస క్రీడ.. వీడియో ఇదిగో!
- చీరకట్టులో మహిళ సముద్రంపై సర్ఫింగ్
- మహిళ తీరుపై భిన్నాభిప్రాయాలు
- సాహస క్రీడల్లో పాల్గొనే వారు స్పోర్ట్స్ వేర్ మాత్రమే ధరించాలని హితవు
ఆధునిక జీవన శైలికి అనువైన వస్త్రధారణకు మహిళలు అలవాటు పడిపోవడంతో చీరల వంటి సంప్రదాయక వస్త్రధారణ కొన్ని ప్రత్యేక సందర్భాలకే పరిమితమైంది. అయితే, నయా లైఫ్ స్టైల్‌కు చీరలూ అనువైనవని రుజువు చేసేందుకు కొందరు ట్రై చేస్తుంటారు. తాజాగా, చీరకట్టులో ఓ మహిళ సముద్రంపై సాహస క్రీడలో పాల్గొన్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆమె చీరకట్టుకుని సముద్రంపై కైట్ సర్ఫీంగ్ చేసింది. అంటే..చిన్న సైజు పారషూట్ సాయంతో సముద్రం అలలపై సర్ఫింగ్ చేసింది.
వీడియో చూసిన అనేక మంది ఆమెపై ప్రశంసలు కురిపిస్తుండగా కొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. క్రీడల కోసం ప్రత్యేక దుస్తులు రూపొందించేది ఫ్యాషన్ కోసం కాదని చెప్పారు. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు స్పోర్ట్స్ వేర్ డిజైన్ చేస్తారని విమర్శలు గుప్పించారు. మరికొందరు మాత్రం చీరను ఆ మహిళ మరోలా కట్టుకుని వుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇలా భిన్నాభిప్రాయాల నడుమ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.