చంద్రయాన్-3 మిషన్‌ లో హైదరాబాదీ కంపెనీ

  • కీలక పరికరాలను తయారుచేసిచ్చిన ప్రెసిసన్ ఇంజనీర్స్ లిమిటెడ్
  • కూకట్ పల్లిలోని ప్రశాంత్ నగర్ లో కంపెనీని స్థాపించిన డీఎన్ రెడ్డి
  • మరికాసేపట్లో నింగికెగరనున్న జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్
ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చంద్రయాన్-3 లో హైదరాబాదీ కంపెనీ కూడా భాగస్వామ్యం ఉంది. ఈ మిషన్ లో భాగంగా రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్ లను జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ తీసుకెళుతోంది. వీటిలో కొన్ని పార్టులు కూకట్ పల్లిలో ఉన్న ఎయిర్ స్పేస్ అండ్ ప్రెసిసన్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోనే తయారయ్యాయని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట వేదికగా ఈ ప్రయోగం జరగనుంది. మరికాసేపట్లో మార్క్ 3 రాకెట్ నింగికెగరనుంది. ఈ ప్రాజెక్టుపై భారతీయులతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. 

ప్రెసిసన్ కంపెనీని డీఎన్‌ రెడ్డి కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్‌లో ఏర్పాటు చేశారు. ఎయిరోస్పేస్ రంగంలో కీలకమైన పరికరాలను తయారు చేస్తోంది. ఇస్రో గతంలో చేపట్టిన పలు ప్రాజెక్టుల్లోనూ ఈ కంపెనీ పాలుపంచుకుంది.
1998 నుంచి ఇస్రో ప్రయోగించిన 50 ఉపగ్రహాలలో పలు విడి భాగాలను తయారుచేసింది. తాజాగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టులో రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యుల్స్‌లో బ్యాటరీలు ఏర్పాటు చేసుకునే విడి భాగాలను తయారుచేసిచ్చింది.


More Telugu News