వరంగల్ బీజేపీలో ముసలం.. ప్రత్యేక జేఏసీ ఏర్పాటు చేసుకున్న సీనియర్లు
- జిల్లా బీజేపీ నేతల మధ్య ఆధిపత్య పోరు
- పార్టీలో అవమానాలు జరుగుతున్నాయన్న సీనియర్లు
- రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని వ్యాఖ్య
తెలంగాణలో బీజేపీ బలపడుతోందని అందరూ భావిస్తున్న తరుణంలో ఆ పార్టీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేతల మధ్య విభేదాలు, అంతరాలు ఆ పార్టీ గ్రాఫ్ దెబ్బతినేలా చేస్తున్నాయి. కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి కీలక నేతలు దూరంగా ఉంటడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర నాయకత్వంతో వీరికి పొసగడం లేదని చెప్పుకుంటున్నారు. మరోవైపు వరంగల్ జిల్లాలో బీజేపీ నేతల మధ్య సఖ్యత కొరవడింది. నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీకి డ్యామేజ్ కలిగించే స్థాయికి చేరింది.
జిల్లాలోని కొందరు సీనియర్ బీజేపీ నేతలు ప్రత్యేకంగా ఒక జేఏసీని ఏర్పాటు చేసుకోవడం పార్టీలో అంతర్గతంగా కలకలం రేపుతోంది. పార్టీలో తమకు అవమానాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శక్తివంచన లేకుండా పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తున్నప్పటికీ కనీస మద్యాద కూడా దక్కడం లేదని వారు మండిపడుతున్నారు. జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.