నిరుద్యోగులకు శుభవార్త.. కేజీబీవీ, యూఆర్ఎస్‌లో 1,241 పోస్టులు
- నోటిఫికేషన్ జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ
- ఈ నెల 26 నుంచి ఆన్ లైన్ లో అప్లికేషన్లు
- కేజీబీవీల్లో మహిళా అభ్యర్థులే అర్హులు
తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్‌ఎస్)లోని ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేజీబీవీ, యూఆర్‌ఎస్‌ల్లో మొత్తం 1,241 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్టు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటన జారీ చేసింది. కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్, పీజీసీఆర్‌టీ, సీఆర్‌టీ, పీఈటీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో స్పెషల్ ఆఫీసర్, సీఆర్‌టీల ఖాళీలను కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.
అభ్యర్థుల అర్హత, రాత పరీక్షా విధానం, పరీక్ష సిలబస్, అభ్యర్థుల ఎంపిక విధానం తదితర వివరాలతో కూడిన సమగ్ర నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in లో ఈరోజు నుంచి అందుబాటులో ఉంటుందని విద్యాశాఖ తెలిపింది. ఇతర వివరాలు ఈ నెల 25 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. అభ్యర్థులు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులకు వచ్చే నెలలో ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందని పేర్కొన్నది.