చిన్నప్పటి స్నేహితురాలితో సీఎస్కే బౌలర్ పాండే ఎంగేజ్ మెంట్
- నభా గద్దంవర్ తో నిశ్చితార్థ కార్యక్రమం
- సహచర విద్యార్థి నుంచి జీవిత సహచరిగా పదోన్నతి అంటూ కామెంట్
- తోటి క్రికెటర్ల నుంచి శుభాకాంక్షలు
ఐపీఎల్ 2023లో చెన్నై జట్టు తరఫున మంచి ప్రతిభ చూపించిన యువ బౌలర్ తుషార్ దేశ్ పాండే త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. చెన్నై జట్టులో ఇప్పటికే రుతురాజ్ గైక్వాడ్ ఈ నెలలోనే తన ప్రేయసి ఉత్కర్ష పవార్ తో వివాహం చేసుకోవడం తెలిసిందే. ఇప్పుడు అతడి బాటలోనే తుషార్ నడుస్తున్నట్టుంది. ఐపీఎల్ రెండు నెలల పాటు సాగే సీజన్. సరిగ్గా పెళ్లి ముహూర్తాలు కూడా ఎక్కువగా ఈ సీజన్ లోనే ఉంటుంటాయి. దీంతో ఐపీఎల్ ముగిసీ ముగియగానే గైక్వాడ్ పెళ్లి పూర్తి చేసుకున్నాడు.
ఇక, స్కూల్ లో తనతోపాటు కలసి చదువుకున్న తన ప్రేయసి, నభా గద్దంవర్ ను పాండే పెళ్లి చేసుకోనున్నాడు. వీరి వివాహ నిశ్చితార్థం ముంబైలో జరిగింది. పాండే తన దేశవాళీ క్రికెట్ ముంబై తరఫునే ఆడాడు. ‘‘ఆమె నా స్కూల్ నుంచి నా జీవిత భాగస్వామిగా పదోన్నతి పొందింది’’ అంటూ దేశ్ పాండే పోస్ట్ పెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు.
సీఎస్కే ఓపెనర్ తురురాజ్ గైక్వాడ్ దేశ్ పాండేకి వివాహితుల క్లబ్ లోకి ఆహ్వానం పలికాడు. క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, సిమర్ జీత్ సింగ్ శుభాకాంక్షలు చెప్పారు. పాండే తో కలసి దేశవాళీ క్రికెట్ లో ముంబైకి, సీఎస్కేలోనూ ఆడిన శివమ్ దూబే మాత్రం ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు.