స్వీడన్ లో సెక్స్ చాంపియన్ షిప్ వట్టిదే!
- యూరప్ దేశం స్వీడన్ లో సెక్స్ పోటీలు అంటూ వైరల్ న్యూస్
- గతంలోనే ఇది ఫేక్ అంటూ ఖండించిన స్వీడన్ మీడియా సంస్థ
- సెక్స్ టోర్నీ ప్రతిపాదన వచ్చినమాట నిజమేనని వెల్లడి
- అయితే అధికారులు అనుమతి ఇవ్వలేదని స్పష్టీకరణ
యూరప్ దేశం స్వీడన్ లో సెక్స్ చాంపియన్ షిప్ నిర్వహిస్తున్నారని, అందుకోసం పలు కేటగిరీల్లో ఎంట్రీలను కూడా ఆహ్వానిస్తున్నారని ఓ సంచలన వార్త వైరల్ అయింది. జూన్ 8 నుంచి సెక్స్ పోటీలు ప్రారంభం అవుతాయని, కంటెస్టెంట్లు ప్రతి రోజూ 6 గంటల పాటు ఈ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని ఈ కథనంలో పేర్కొన్నారు.
ఈ శృంగార పోటీలను చూడ్డానికి ప్రేక్షకులను కూడా అనుమతిస్తారంటూ టోర్నీపై అంచనాలను అమాంతం పెంచేశారు. అయితే, ఈ సెక్స్ చాంపియన్ షిప్ వట్టిదేనని తేలింది. గోటెర్ బోర్గ్స్ పోస్టెన్ అనే స్వీడిష్ మీడియా సంస్థ దీనిపై ఏప్రిల్ లోనే స్పష్టత నిచ్చింది.
సెక్స్ చాంపియన్ షిప్ ప్రతిపాదన వచ్చినమాట నిజమేనని, కానీ అధికార వర్గాలు ఈ సెక్స్ టోర్నీకి అనుమతి ఇవ్వలేదని ఆ మీడియా సంస్థ అప్పట్లోనే పేర్కొంది. గోటెర్స్ బోర్గ్స్ పోస్టెన్ మీడియా సంస్థ కథనం ప్రకారం... స్వీడన్ లో ఫెడరేషన్ ఆఫ్ సెక్స్ అనే సంస్థ ఉంది. దాని అధినేత డ్రాగన్ బ్రాక్టిక్.
మానవాళిపై శారీరకంగా, మానసికంగా శృంగారం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు సెక్స్ చాంపియన్ షిప్ నిర్వహించాలని తలపెట్టాడు. స్వీడన్ లో క్రీడా పోటీలు జరపాలంటే నేషనల్ స్పోర్ట్స్ కాన్ఫెడరేషన్ లో సభ్యత్వం తప్పనిసరి. అయితే, ఈ స్పోర్ట్స్ కాన్ఫెడరేషన్ లో సభ్యత్వం కోరుతూ డ్రాగన్ బ్రాక్టిక్ సంస్థ ఫెడరేషన్ ఆఫ్ సెక్స్ దాఖలు చేసిన దరఖాస్తును స్వీడన్ అధికారవర్గాలు తిరస్కరించాయి.
బ్రాక్టిక్ కు స్వీడన్ వ్యాప్తంగా పలు స్ట్రిప్ క్లబ్ లు ఉన్నాయి. సెక్స్ ను కూడా ఓ క్రీడగా పరిగణించాలని బ్రాక్టిక్ చాలాకాలంగా పోరాడుతున్నాడు. కాగా, సెక్స్ చాంపియన్ షిప్ పై స్వీడన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కానీ, ప్రకటన కానీ రాలేదు.