ఉడుకుతున్న దక్షిణ కోస్తా జిల్లాలు.. చండ్రనిప్పులు కురిపిస్తున్న భానుడు!

  • నేడు, రేపు కూడా అల్లాడించనున్న సూరీడు
  • ఉత్తర కోస్తాలో భిన్నమైన వాతావరణం
  • కామవరపుకోటలో అత్యధికంగా 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత
ప్రచండ భానుడు కక్కుతున్న నిప్పులతో దక్షిణ కోస్తా జిల్లాలు ఉడికిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా 45 నుంచి 46 డిగ్రీలు నమోదవుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నేడు, రేపు కూడా పరిస్థితులు ఇలానే ఉండే అవకాశం ఉందని, కాబట్టి వీలైనంత వరకు ఎండకు దూరంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

మరోవైపు, ఉత్తర కోస్తా జిల్లాల్లో మాత్రం భిన్నమైన వాతావరణం నెలకొంది. పిడుగులు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోపాటు చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో గరిష్ఠంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా సాయంత్రానికి వాతావరణం చల్లబడుతోంది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 8న రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని, అప్పటి వరకు ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఇక, నిన్న అత్యధికంగా ఏలూరు జిల్లా కామవరపుకోటలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలకుపైగానే నమోదయ్యాయి.


More Telugu News