ఏపీలో రాగల మూడ్రోజులకు వర్షసూచన
- నిప్పుల కుంపటిలా ఏపీ
- పశ్చిమ బెంగాల్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి
- ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
- గంటకు 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు
మండుతున్న ఎండలతో నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఏపీకి వర్షసూచన వెలువడింది. రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది.
గంటకు 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. పగటి పూట మాత్రం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ నుంచి చత్తీస్ గఢ్ మీదుగా ఉత్తర తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతున్న సంగతి తెలిసిందే.