ఉగ్రవాదులతో లింక్ ఉన్నవారిని అరెస్ట్ చేశాం: ఎంపీ హోంమంత్రి
- ఉగ్రవాదులతో లింక్ ఉన్న 16 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడి
- దేశంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు చేశారన్న మంత్రి
- కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో సోదాలు చేసినట్లు తెలిపిన నరోత్తమ్
ఉగ్రవాదులతో లింక్ ఉన్న పదహారు మందిని అరెస్ట్ చేసినట్లు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. దేశంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. ఇక్కడ షరియా చట్టాన్ని అమలు చేసేందుకు ఉగ్రవాదులతో లింక్ ఉన్న గ్రూపులు ప్లాన్ చేశాయని తెలిపారు. హైదరాబాద్, భోపాల్ లో సోదాలు నిర్వహించి ఉగ్రవాదులతో లింక్ కలిగిన వారిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో ఈ సోదాలు నిర్వహించామన్నారు.