తెలంగాణలో గెలుపు కోసం కాంగ్రెస్ వ్యూహం, విలేజ్ కమిటీల ఏర్పాటు

  • గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
  • ప్రతి మండలంలో కనీసం 25 మంది సభ్యులతో కాంగ్రెస్ ఎన్నికల బృందం ఏర్పాటు
  • కమిటీలో 40 శాతం మంది మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు
తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పార్టీల మధ్య, పట్టణ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోటీ నెలకొందని చెప్పవచ్చు. గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు గ్రామీణ ఎన్నికల బృందాల ఏర్పాటుపై దృష్టి సారించింది. ప్రతి మండలంలో కనీసం 25 మంది సభ్యులతో ఎన్నికల బృందాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇందులో 40 శాతం మంది మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలతో పాటు 50 ఏళ్లలోపు వారు ఉంటారు.

ఈ నెలాఖరులోగా రూరల్‌ ఎన్నికల టీమ్‌లు అన్నీ అందుబాటులోకి రానున్నాయి. ముందస్తు ప్రచార శిక్షణ తరగతుల అనంతరం ఆ బృందం గ్రామాల్లో ప్రచారం చేస్తారు. తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి నియోజవకర్గంలో 5 మండలాలు ఉన్నాయి. మొత్తం 600 మండలాలు, 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
 
ప్రతి గ్రామంలో నిబద్ధత కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తిస్తున్నామని, ప్రతి గ్రామం నుండి కనీసం ఒకరు లేదా ఇద్దరు కార్యకర్తలు ఎన్నికల బృందంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అవసరమైతే ప్రతి గ్రామం నుండి ఈ సంఖ్య మరింత పెరగవచ్చునని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ, తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలను వీరు ప్రజల్లోకి తీసుకు వెళ్తారన్నారు.


More Telugu News