లక్నోలోనూ వానే... ఐపీఎల్ మ్యాచ్ కు అంతరాయం!

  • లక్నోలో నేడు ఆర్సీబీ, సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
  • 15.2 ఓవర్ల వద్ద వరుణుడి ప్రత్యక్షంతో నిలిచిన ఆట
  • అప్పటికి 4 వికెట్లకు 93 పరుగులు చేసిన ఆర్సీబీ
దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తున్న వరుణుడు లక్నోలోనూ ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడి వాజ్ పేయి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ కు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. 

టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు బ్యాటింగ్ ఎంచుకోగా, 15.2 ఓవర్ల వద్ద వర్షంతో మ్యాచ్ నిలిచిపోయింది. అప్పటికి ఆర్సీబీ 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ 40, దినేశ్ కార్తీక్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. అయితే కురిసింది కొద్దిపాటి వర్షం మాత్రమే కావడంతో, కాసేపటికే మళ్లీ మ్యాచ్ ప్రారంభమైంది.

కాగా, ఫీల్డింగ్ చేస్తున్న సందర్భంగా లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. బౌండరీ వెళ్లే బంతిని ఆపేందుకు పరిగెడుతూ ఒక్కసారిగా నొప్పితో విలవిల్లాడిపోయాడు. కేఎల్ రాహుల్ ను జట్టు ఫిజియో, ఇతర సిబ్బంది వచ్చి తీసుకెళ్లాల్సి వచ్చింది.


More Telugu News