అమ్మో ఎలుక.. టాలెంట్ మామూలుగా లేదుగా! ఇది చాట్‌జీపీటీ కాదు ర్యాట్ జీపీటీ!

  • మనుషుల ఉచ్చు నుంచి చాకచక్యంగా తప్పించుకున్న ఎలుక
  • ఎలుక తెలివి చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు
  • ఎలుక కూడా ర్యాట్ జీపీటీ వాడినట్టుందంటూ కామెంట్స్
  • నెట్టింట వీడియో వైరల్
మనుషులు పన్నే ఉచ్చులో ఏ జంతువైనా పడిపోవాల్సిందే! ఇప్పటివరకూ ఇదే జరిగినా ఇకపై అలా కుదరదని నిరూపించిందో ఎలుక. ఓ ఉచ్చు నుంచి జాగ్రత్తగా తప్పించుకోవడమే కాకుండా ఆ ఎలుక తనకు కావాల్సిన ఆహారాన్ని అత్యంత చాకచక్యంగా తీసేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలోని ఎలుక ఓ పుల్లతో ఉచ్చుపై ఉన్న ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకుంది. ఇది చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. 

చాట్‌జీపీటీ రాకతో తమ ఉపాధి అవకాశాలపై నీలినీడలు కమ్ముకున్నాయని బాధపడుతున్న అనేక మంది ఎలుకలు కూడా ఇలా తెలివిమీరిపోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలుకలకు ప్రత్యేకమైన ర్యాట్ జీపీటీని ఇది వాడిందేమో అంటూ మరికొందరు సరదా కామెంట్స్ చేస్తున్నారు. ఇక తమకు భూమ్మీద చోటులేనట్టేనని వ్యాఖ్యానిస్తున్నారు. చిన్న చిన్న లేఖలు రాయడం నుంచి సంక్లిష్టమైన సాఫ్ట్‌వేర్ కోడ్ వరకూ చాట్‌జీపీటీ అనేక అద్భుతాలు చేస్తున్న విషయం తెలిసిందే.


More Telugu News