పెద్ద శబ్దంతో పాటలు వద్దన్నందుకు గర్భవతిపై కాల్పులు
- ఢిల్లీలో వెలుగు చూసిన దారుణం
- పెద్ద శబ్దంతో పాటలు వద్దన్న గర్భవతిపై కాల్పులు
- బాధితురాలికి గర్భస్రావం, పరిస్థితి విషమం
- నిందితుడిపై హత్యానేరంతో పాటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు
ఢిల్లీలో తాజాగా ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. పెద్ద శబ్దంతో పాటలు వద్దన్న మహిళపై ఓ యువకుడు కాల్పులు జరపడంతో ఆమెకు గర్భస్రావం జరిగింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని సిర్సాపూర్ ప్రాంతంలో రంజూ అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివసిస్తుంటుంది. ఆమె ప్రస్తుతం కడుపుతో ఉంది. ఇదిలా ఉంటే.. ఆదివారం ఎదిరింట్లో ఓ ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా హరిష్ అనే వ్యక్తి పెద్ద శబ్దంతో పాటలు ప్లే చేయడం ప్రారంభించాడు. అయితే రంజూ దీనికి అభ్యంతరం చెప్పింది. పెద్ద శబ్దంతో పాటలు వద్దంటూ తన బాల్కనీలో నిలబడి హరీష్‌కు చెప్పింది.
దీంతో కోపోద్రిక్తుడైన హరీశ్ తన స్నేహితుడు అమిత్ వద్ద ఉన్న పిస్తోలు తీసుకుని రంజూపై కాల్పులు జరిపాడు. ఆమె మెడలోకి తూటా దూసుకుపోవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే వైద్యులు ఆమెకు అబార్షన్ చేశారు. బాధితురాలి బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హరీష్, అతడి స్నేహితుడిపై హత్యాయత్నంతో పాటూ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.