ప్రియుడితో భార్య పరార్.. మామను కాల్చి చంపిన భర్త

  • మహారాష్ట్రలో వెలుగు చూసిన షాకింగ్ ఘటన
  • ప్రియుడితో భార్య వెళ్లిపోవడంతో భర్తకు తీవ్ర మనస్తాపం
  • పిల్లనిచ్చిన మామతో భర్త వాగ్వాదం, తుపాకితో కాల్చి హత్య
  • నిందితుడి కోసం పోలీసుల గాలింపు
వివాహేతర సంబంధం ఓ కుటుంబంలో పెను విషాదం నింపింది. ఓ వ్యక్తి తనకు పిల్లనిచ్చిన మామను కాల్చి చంపేశాడు. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది. ఔరంగాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి భార్య తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. 

భార్య తనను మోసం చేసిందంటూ తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి తన అత్తారింటికి వెళ్లి మామతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరుకోవడంతో అల్లుడు తుపాకీతో తన మామను కాల్చి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నట్టు స్థానిక ఇన్‌స్పెక్టర్ శిరీశ్ హంబే మీడియాకు తెలిపారు.


More Telugu News