కోనసీమ అల్లర్ల కేసుల విషయంలో జగన్ కీలక నిర్ణయం
- కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంతో చెలరేగిన అల్లర్లు
- కేసులు ఎత్తివేయాలని జగన్ నిర్ణయం
- అందరూ కలిసిమెలిసి ఉండాలనే యోచనతోనే నిర్ణయం తీసుకున్నామన్న సీఎం
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంతో అమలాపురంలో భారీ హింస చెలరేగిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యేలు విశ్వరూప్, పొన్నాడ సతీశ్ ల ఇళ్లకు కూడా దుండగులు నిప్పు పెట్టారు. రాళ్ల దాడులు, బస్సుల దహనం వంటివి కూడా చోటు చేసుకున్నాయి. దీంతో పలువురిపై కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలో తాజాగా ఈ కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిందితులపై కేసులు ఎత్తి వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. అమలాపురంలో జరిగిన ఘటనను అందరూ మరిచిపోయి, కలిసిమెలిసి ఉండాలనే యోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. మరోవైపు కేసులను ఎత్తి వేయాలనే నిర్ణయం తీసుకున్న జగన్ కు కోనసీమ నేతలు ధన్యవాదాలు తెలుపుతున్నారు.