ఒక్క పిడుగు.. 300 మేకల మృత్యువాత

  • ఉత్తరకాశీ ప్రాంతంలో విషాదం
  • ఇంత భారీ సంఖ్యలో చనిపోవడం అరుదు
  • నష్ట నివారణకు బృందాన్ని పంపిన విపత్తుల నిర్వహణ విభాగం
పిడుగుపాటుకు మనుషులు, పశువులు మృత్యువాత పడడం తెలిసిన విషయమే. కానీ, ఉత్తరకాశీలోని ఖట్టు ఖాల్ అటవీ ప్రాంతంలో పిడుగు పాటుకు ఏకంగా 350 మేకలు చనిపోయాయి. శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బర్సు గ్రామానికి చెందిన సంజీవ్ రావత్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలసి గొర్రెలు, మేకలను రిషికేష్ నుంచి ఉత్తరకాశీకి తీసుకొస్తున్న క్రమంలో పిడుగు పడింది. 

విపత్తుల నిర్వహణ విభాగం ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఓ బృందాన్ని పంపించింది. నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించిన తర్వాత, దాన్ని జిల్లా యంత్రాంగానికి పంపిస్తామని విపత్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది. పిడుగుపాటుకు పదుల సంఖ్యలో పశువులు మరణించిన సంఘటనలు విన్నాం. కానీ,ఇప్పుడు ఏకంగా 350 వరకు చనిపోయాయి.


More Telugu News