పార్టీలన్నీ తీసికట్టు.. 2021-22లో బీజేపీకి రూ.1,161 కోట్ల ఆదాయం
- ఏడు జాతీయ పార్టీలకు మొత్తంగా రూ. 2,172 కోట్ల ఆదాయం
- ఆరు పార్టీలకు వచ్చిన ఆదాయంలో 53.45 శాతం బీజేపీకే
- టీఎంసీకి రూ.528 కోట్ల ఆదాయం
2021-22 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలు ఆర్జించిన ఆదాయ లెక్కలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. దేశంలోని ఏడు జాతీయ పార్టీలు.. కాంగ్రెస్, బీజేపీ, టీఎంసీ, ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఎం, ఎన్‌పీపీలకు మొత్తం రూ. 2,172 కోట్ల ఆదాయం రాగా, అందులో సగం ఒక్క బీజేపీకే రావడం గమనార్హం. ఈ పార్టీలకు అందిన ఆదాయంలో 66 శాతం అజ్ఞాత వ్యక్తుల నుంచి అందినట్టు ఏడీఆర్ తెలిపింది.
జాతీయ పార్టీలన్నింటికీ కలిపి వచ్చిన రూ.2,172 కోట్ల ఆదాయంలో దాదాపు సగం అంటే రూ.1,161 కోట్ల ఆదాయం ఒక్క బీజేపీకే వచ్చినట్టు ఏడీఆర్ పేర్కొంది. ఇది ఆరు పార్టీలకు వచ్చిన మొత్తం ఆదాయంలో 53.45 శాతమని వివరించింది. జాతీయ పార్టీల ఆదాయంలో 66 శాతం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చినట్టు తెలిపింది. పార్టీల వార్షిక ఆడిట్ నివేదికల ఆధారంగా ఈ వివరాలను సేకరించినట్టు పేర్కొంది.
బీజేపీ తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు రూ. 528 కోట్ల ఆదాయం వచ్చింది. ఇతర జాతీయ పార్టీల ఆదాయంలో ఇది 24.31 శాతం. అలాగే, 2021-22లో వివిధ మార్గాల ద్వారా జాతీయ పార్టీలు రూ. 17,249.45 కోట్లను విరాళాలుగా పొందాయి.