మెడలో రుద్రాక్షలు, నుదుటిన బొట్టుతో ప్రత్యేక పూజల్లో విరాట్ కోహ్లీ

  • ఉజ్జయిని మహా కాళేశ్వర ఆలయానికి వచ్చిన కోహ్లీ, అనుష్క 
  • చీర ధరించిన అనుష్క శర్మ 
  • ఈ నెల 9 నుంచి అహ్మదాబాద్ లో నాలుగో టెస్టు 
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహా కాళేశ్వర ఆలయానికి టీమిండియా క్రికెటర్లంతా క్యూ కడుతున్నారు. అక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తాజాగా భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శర్మ ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కోహ్లీ చొక్కా లేకుండా మెడలో కండువ, రుద్రాక్షలు వేసుకొని నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకోగా.. అనుష్క చీర ధరించింది. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి కోహ్లీ, అనుష్క దంపతులకు ఆశీర్వచనాలు ఇచ్చారు.

దంపతులు గుడిలో కూర్చొని పూజలు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. కాగా, గతేడాది కోహ్లీ, అనుష్క తమ కూతురు వామికతో కలిసి రిషికేష్ లోని వ్రిందావన్ ఆశ్రమాన్ని సందర్శించారు. బాబా నీమ్ కరోలి ఆశ్రమంలోనూ పూజల్లో పాల్గొన్నారు. కాగా, ఇండోర్ లో జరిగిన మూడో టెస్టులో భారత్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. నాలుగో టెస్టు ఈనెల 9వ తేదీన అహ్మదాబాద్ లో మొదలవుతుంది.


More Telugu News