ఇటలీ తీరంలో విషాద ఘటన... శరణార్థుల పడవ మునిగి 34 మంది మృతి

  • 100 మందికి పైగా శరణార్థులతో వస్తున్న పడవ
  • శరణార్థులు ఇరాన్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ కు చెందినవారు
  • ఓ గ్రామంలోని తీరానికి కొట్టుకొచ్చిన మృతదేహాలు
  • మృతుల్లో ఒక పసికందు
సొంతదేశంలో పొట్ట గడవక, కల్లోల భరిత పరిస్థితుల్లో జీవించలేక ఇతర దేశాలకు వలస వెళదామనుకునే శరణార్థులు అనేక సందర్భాల్లో సముద్ర ప్రమాదాలకు గురవుతుండడం తెలిసిందే. 

తాజాగా, ఇటలీ తీరంలో విషాద ఘటన జరిగింది. శరణార్థులతో వస్తున్న పడవ మునిగిపోవడంతో 34 మంది మృత్యువాత పడ్డారు. మృతిచెందిన వారిలో ఓ పసికందు కూడా ఉండడం స్థానిక అధికారులను కలచివేసింది.

ఈ పడవలో 100 మందికి పైగా శరణార్థులు ఉన్నట్టు ఇటలీ కోస్ట్ గార్డ్ అధికారులు భావిస్తున్నారు. వారంతా ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ కు చెందినవారిగా గుర్తించారు. కోట్రోన్ ప్రావిన్స్ లోని కలాబ్రియా గ్రామం వద్ద తీరానికి మృతదేహాలు కొట్టుకొని వచ్చాయి. అలల ఉద్ధృతికి సముద్రంలోని బండరాళ్లను బోటు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బోటు మధ్యకు విరిగిపోవడంతో శరణార్థులు నీటిలో మునిగిపోయారు.


More Telugu News