ఆలయం తలుపులు స్వయంగా తెరిచిన ఏనుగు.. మారాం చేసి పంతం నెగ్గించుకున్న వైనం!
- తిరువానైక్కావల్ జంబుకేశ్వర ఆలయంలో అరుదైన ఘటన
- ఆలయం తలుపులు తెరించేందుకు పట్టుబట్టి పంతం నెగ్గించుకున్న ఏనుగు
- సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
అది తిరుచ్చిలోని ప్రసిద్ధ తిరువానైక్కావల్ జంబుకేశ్వర ఆలయం. ఆలయంలో అఖిల అనే ఏనుగు ఒకటుంది. గున్న ఏనుగుగా ఉన్నప్పుడే దాన్ని ఆలయానికి తీసుకొచ్చారు. ఈ ఏనుగును ఉత్సవ సమయాల్లో స్వామి వారి సేవకు వినియోగిస్తుంటారు.
ఇదిలావుంటే.. తాజాగా ఆ ఏనుగుకు సంబంధించిన ఓ ఆసక్తికర ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆలయం తలుపులు తెరిచేందుకు ఏనుగు పట్టుపట్టడం, మారాం చేసి మరీ తన పంతం నెగ్గించుకోవడం స్థానికుల్లో పెద్ద చర్చకే దారి తీసింది. ఏనుగు ఆలయం తలుపులు స్వయంగా తెరిచి బయటకు వస్తున్న వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.