కోటంరెడ్డికి టికెట్ గ్యారంటీ లేదు... అందుకే ఆరోపణలు: మంత్రి కారుమూరి
- ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన కోటంరెడ్డి
- సొంత పార్టీనే వేలెత్తి చూపిస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే
- వంక లేనోడు డొంక పట్టుకుని వేళ్లాడినట్టుందన్న కారుమూరి
- సర్వేల్లో ఓటమి తప్పదనుకున్నవాళ్లు వెళ్లిపోతున్నారని వెల్లడి
వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రులు విమర్శల దాడి కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ధ్వజమెత్తారు. కోటంరెడ్డి తీరు చూస్తుంటే వంక లేనోడు డొంక పట్టుకుని వేళ్లాడినట్టుగా ఉందని వ్యంగ్యం ప్రదర్శించారు.
కోటంరెడ్డికి టికెట్ గ్యారంటీ లేకపోవడంతో ఆరోపణలు చేసి వెళ్లిపోయాడని కారుమూరి వ్యాఖ్యానించారు. సర్వేల్లో ఓటమి తప్పదని తేలినవాళ్లు పార్టీ వదిలిపోతున్నారని తెలిపారు. గెలుపు గుర్రాలకే టికెట్ అనేది సీఎం జగన్ విధానం అని స్పష్టం చేశారు.
తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ సొంత పార్టీపైనే కోటంరెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే. బాలినేని వంటి నేతలు కలిసి నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా, కోటంరెడ్డి తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టంగా ప్రకటించారు.