మ్యాచ్ కు ముందు కావాల్సినంత విశ్వాసాన్ని ఇచ్చావు: పాండ్యాతో శుభ్ మన్ గిల్
- టీమిండియా టీ20 కెప్టెన్ పాండ్యాను పొగిడిన గిల్
- 90 శాతం క్రెడిట్ తన తండ్రికి వెళుతుందని ప్రకటన
- 126 పరుగులతో నాటౌట్ గా నిలిచి విజయంలో ముఖ్యపాత్ర
టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ బుధవారం న్యూజిలాండ్ పై చేసిన శతక బాదుడుని అభిమానులు బాగా ఆస్వాదించారు. 63 బంతులకు 126 పరుగులు చేసిన గిల్ నాటౌట్ గా నిలిచాడు. తనతోపాటు ఓపెనింగ్ కు వచ్చిన ఇషాన్ కిషన్, తన తర్వాత వచ్చిన త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా తక్కువ స్కోరుకే అవుటైనా, గిల్ మూలస్తంభం మాదిరిగా నిలిచి భారత్ విజయానికి తోడ్పడ్డాడు.
అందుకే ఈ మ్యాచ్ లో భారత్ 168 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్ల ప్రదర్శన అద్భుతంగా ఉండడం కూడా విజయానికి ముఖ్య కారణమే. గిల్ తన ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, ఏడు సిక్సర్ల మోత మోగించాడు. గిల్ ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు సభ్యుడు. అదే జట్టు కెప్టెన్ గా ఉన్న పాండ్యా టీమిండియా టీ20 జట్టును నడిపిస్తుండడం గిల్ కు కలిసొచ్చింది. గిల్ ప్రతిభ పట్ల పాండ్యా ఎంతో నమ్మకం ఉంచగా, దాన్ని అతడు నిలబెట్టుకున్నాడు.
తన ఆటతీరుపై మ్యాచ్ అనంతరం మైదానంలో పాండ్యాతో గిల్ మాట్లాడాడు. ‘‘టీ20ల్లో నా అంచనాలకు తగ్గట్టుగా నేను ఆడడం లేదు. మంచి ప్రదర్శన ఇవ్వాలనే ఆరాటంతో ఉన్నాను. మ్యాచ్ కు ముందు కావాల్సినంత విశ్వాసాన్ని నీవు నాకు అందించావు. ‘ఆట పట్ల నమ్మకం ఉంచు’ అని చెప్పావు. అది నాకు సాయపడింది. నేను ప్రాక్టీస్ చేసిన విధానం, మా నాన్న నాతో ప్రాక్టీస్ చేయించిన తీరు.. 90 శాతం క్రెడిట్ అతడికే వెళుతుంది’’ అని గిల్ చెప్పాడు.