విమానంలో కొట్టుకున్న వారిపై కేసు.. అలాంటి ప్రవర్తన తగదన్న కేంద్ర మంత్రి సింధియా 

  • ఇద్దరు ప్రయాణికుల మధ్య ఘర్షణ 
  • అనంతరం కొట్లాట
  • కేసు నమోదు చేసినట్టు కేంద్ర మంత్రి ప్రకటన
  • రంగంలోకి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ
బ్యాంకాక్ నుంచి కోల్ కతాకు వచ్చే ఫ్లయిట్ లో ఇద్దరు ప్రయాణికులు ఘర్షణ పడి కొట్టుకోవడం పట్ల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విచారం వ్యక్తం చేశారు. అలాంటి ప్రవర్తన ఆమోదనీయం కాదని పేర్కొన్నారు. థాయ్ స్మైల్ ఎయిర్ వే ఫ్లయిట్ లో ప్రయాణికుల మధ్య జరిగిన ఘర్షణపై పోలీసు కేసు నమోదైనట్టు ట్విట్టర్లో సింధియా ప్రకటించారు.

గత మంగళవారం ఇద్దరు ప్రయాణికులు వాగ్వివాదానికి దిగగా, వారిని నిలువరించేందుకు హెయిర్ హోస్టెస్ చేసిన ప్రయత్నం విఫలమైంది. అనంతరం ఒక ప్రయాణికుడిని తోటి ప్రయాణికులు చుట్టుముట్టి ముఖంపై కొట్టారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని, ఏవియేషన్ సెక్యూరిటీ బాధ్యతలు చూసే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశించింది.


More Telugu News