అవతార్ సినిమాలో కొన్ని సన్నివేశాల తొలగింపు.. ఎందుకో చెప్పిన కామెరాన్
- 10 నిమిషాల పాటు ఉండే గన్ ప్లే సన్నివేశాల తొలగింపు
- సినిమాలోని అసహజ దృశ్యాలు తొలగించాలని అనుకున్నట్టు వెల్లడి
- యాక్షన్ సినిమాల దర్శకుడిగానే తనకు పేరు పడిందన్న కామెరాన్
అవతార్-2 (ద వే ఆఫ్ వాటర్) సినిమాలో తుపాకుల రక్తపాతం ఏంటి? హింసలా అనిపించడం లేదూ..? జేమ్స్ కామెరాన్ కు సైతం ఇదే డౌట్ వచ్చింది..? అందుకే, ఏకంగా సినిమాలో 10 నిమిషాల మేర సన్నివేశాలను ఆయన కత్తిరించేశారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు కామెరాన్ స్వయంగా వెల్లడించారు. అవతార్ -2 సినిమా విడుదలైన 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్లను వసూలు చేసి రికార్డు నమోదు చేయడం తెలిసిందే. అయితే, కనీసం రెండు బిలియన్ డాలర్లు వసూలైతేనే లాభాలు చూడగలమని కామెరాన్ పేర్కొనడం గమనార్హం.
సినిమా నిడివి తగ్గింపుపై కామెరాన్ మాట్లాడుతూ.. ‘‘నిజానికి 10 నిమిషాల పాటు తుపాకుల కాల్పులతో కూడిన యాక్షన్ సన్నివేశాలను కత్తిరించాను. వెలుగు, చీకటి మధ్య బ్యాలన్స్ లో భాగంగా అసహ్యంగా అనిపిస్తున్న వాటిని తొలగించాలని అనిపించింది. మీలో మీరు సంఘర్షణ పడాలి. మీరు ఎలా చూస్తున్నారనే దాని ఆధారంగా హింస, యాక్షన్ ఒకే విధంగా ఉంటాయి. యాక్షన్ సినిమా రూపొందించే ప్రతీ కళాకారుడికి దీనిపైనే డైలమా ఉంటుంది. కానీ, నేను యాక్షన్ చిత్రాలు తీసే వాడిగానే అందరికీ తెలుసు’’ అంటూ దృశ్యాల తొలగింపు వెనుక మానసిక సంఘర్షణను కామెరాన్ వివరించారు.