12 నిమిషాల్లో ఛార్జింగ్ పూర్తయ్యే కొత్త ఫోన్.. ధర ఎంతంటే!
- భారత్ లో ఇదే ఫాస్టెస్ట్ ఛార్జింగ్ ఫోన్ అంటున్న ఇన్ ఫినిక్స్ కంపెనీ
- జీరో అల్ట్రా పేరుతో ఈ నెల 25 నుంచి మార్కెట్లోకి విడుదల
- ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయొచ్చని ఇన్ ఫినిక్స్ వెల్లడి
దేశంలోనే అత్యంత వేగంగా ఛార్జింగ్ పూర్తయ్యే సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ఇన్ ఫినిక్స్ కంపెనీ అందుబాటులోకి తీసుకురానుంది. జీరో అల్ట్రా పేరుతో తెస్తున్న ఈ 5 జీ ఫోన్ కేవలం 12 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఈ నెల 25 నుంచి ఫ్లిప్ కార్ట్ లో అమ్మకాలు ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.29,999 గా కంపెనీ ప్రకటించింది.
ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు..
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్, 6.8 అంగుళాల ఫుల్ హెచ్ డీ అమోల్డ్ డిస్ ప్లే, ఫింగర్ ప్రింట్ లాక్, 200 ఎంపీ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ అల్ట్రా వైడ్, మరో 2 ఎంపీ డెప్త్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 32 ఎంపీ, బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ గా ఉంటుంది. ఇక 180 వాట్ల సామర్థ్యంతో మన దేశంలో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఫోన్లలో సూపర్ ఫాస్ట్ గా ఛార్జయ్యే ఫోన్ గా జీరో అల్ట్రా నిలిచిపోతుంది.