బిగ్ బాస్ లో సింపతీతో గెలవాలని ఎప్పుడూ అనుకోలేదు: కీర్తి
- బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ లో నిలిచిన కీర్తి
- తాజా ఇంటర్వ్యూలో తన గురించిన విషయాల వెల్లడి
- నటించడం తనకి చేతకాదని వ్యాఖ్య
- తానేం మారలేదని స్పష్టీకరణ
బిగ్ బాస్ లో కీర్తి టాప్ 5లో నిలిచింది. నిజానికి ఆమె శ్రీసత్య కంటే ముందుగానే వెళ్లిపోతుందని చాలామంది అనుకున్నారు .. కానీ అలా జరగలేదు. తన కుటుంబ సభ్యులంతా ఒక ప్రమాదంలో చనిపోవడంతో, తాను ఒంటరిగా మిగిలిపోవలసి వచ్చిందని హౌస్ లో తన సన్నహితులతో కీర్తి చెబుతూ వచ్చింది.
దాంతో సానుభూతితో కీర్తి గెలవాలనుకుంటోందనే ప్రచారం మొదలైంది. ఇదే విషయం తాజా ఇంటర్వ్యూలో ఆమెకి ఎదురైంది. అందుకు కీర్తి స్పందిస్తూ .. "సందర్భం వచ్చినప్పుడు తప్ప నేను ఎవరితోనూ నా పరిస్థితిని గురించి చెప్పుకోలేదు. సానుభూతి కారణంగా గెలవాలని అస్సలు అనుకోలేదు .. ఆ ఆలోచన లేదు" అంటూ చెప్పింది.
"హౌస్ లో ఉన్నప్పుడు కూడా నేను నా బాధను నిజంగానే పడ్డాను గానీ .. నటించలేదు. ఒక రోజు .. లేదంటే ఒక వారం నటించవచ్చు. అంతేగానీ 105 రోజుల పాటు నటించడం సాధ్యం కాదు. నేను బయట ఎలా అయితే ఉన్నానో .. హౌస్ లో కూడా అలాగే ఉన్నాను. పైగా నా చేతికి .. కాలుకి గాయాలైనా, ఆ సాకుతో నేను ఆడటం మానుకోలేదు" అంటూ చెప్పుకొచ్చింది.