ఐపీఎల్ విలువ అందనంత ఎత్తుకు!
- అంచనా వేసిన డీ అండ్ పీ అడ్వైజరీ సంస్థ
- 2020 నాటికి 6.2 బిలియన్ డాలర్లే
- ఫ్రాంచైజీల విలువను నిర్ధారించని సంస్థ
- 400-600 మిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చన్న అభిప్రాయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విలువ 10 బిలియన్ డాలర్లను దాటిపోయింది. దీంతో దీన్ని డెకాకార్న్ గా డీ అండ్ పీ అడ్వైజరీ సంస్థ పేర్కొంది. 2022లో ఐపీఎల్ విలువ 10.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు తాజాగా ప్రకటించింది. అంటే రూపాయిల్లో సుమారు రూ.90,000 కోట్లు. ఐపీఎల్ లో పది జట్లు ఉంటాయి. ఈ జట్లకు కూడా బ్రాండ్ వ్యాల్యూ విడి విడిగా ఉంటుంది. అయితే రెండు కొత్త జట్లు వచ్చి చేరడం, పూర్తి స్థాయి డేటా లేనందున ఐపీఎల్ ఫ్రాంచైజీల వ్యాల్యూషన్ ను పీ అండ్ డీ అడ్వైజరీ ప్రకటించలేదు.
బిలియన్ డాలర్ల విలువను చేరితే యూనికార్న్ గా, 10 బిలియన్ డాలర్ల విలువను దాటితే డెకాకార్న్ గా పిలుస్తుంటారు. 2020లో ఐపీఎల్ విలువ 6.2 బిలియన్ డాలర్లుగా ఉంటే, గత రెండేళ్లలో 75 శాతం పెరిగినట్టు ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన ‘బియాండ్ 22 యార్డ్స్’ నివేదిక తెలియజేసింది. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో విధానం ఆధారంగా విలువను అంచనా వేసింది. ఈ ఏడాది ఐపీఎల్ మీడియా హక్కుల వేలం 6.2 బిలియన్ డాలర్లు పలకడాన్ని విలువకు పరిగణనలోకి తీసుకుంది. అలాగే రెండు కొత్త జట్లకు వేలంలో 1.6 బిలియన్ డాలర్లు పలకడాన్ని సైతం విలువ మదింపునకు తీసుకుంది.
స్థిరమైన కరెన్సీ విలువ ప్రకారం ఐపీఎల్ విలువ 12 బిలియన్ డాలర్లను అధిగమించినట్టు, కరెన్సీ విలువ 10-12 శాతం పతనం కావడంతో 10.9 బిలియన్ డాలర్లుగా డీ అండ్ పీ అంచనాకు వచ్చింది. జట్ల పెరుగుదలతో మ్యాచ్ ల సంఖ్య 74 నుంచి 94కు పెరగడాన్ని కూడా విలువ కోసం పరిగణనలోకి తీసుకున్నారు. విడిగా ఐపీఎల్ ఫ్రాంచైజీ విలువ 400-600 మిలియన్ డాలర్లుగా (రూ.5,000 కోట్ల వరకు) ఉండొచ్చని డీ అండ్ పీ అడ్వైజరీ మేనేజింగ్ పార్ట్ నర్ సంతోష్ పేర్కొన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ షేర్లు ఇప్పటికే అన్ లిస్టెడ్ మార్కెట్లో లభిస్తుండగా, దీని ప్రకారం సీఎస్ స్కే విలువ రూ.5,000 కోట్లుగా ఉంది. లోగడ ఇది యూనికార్న్ విలువ వరకు వెళ్లగా, దిద్దుబాటుకు గురైంది.