భువనేశ్వర్ కుమార్ సంచలన బౌలింగ్... 9 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్థాన్

  • 2 ఓవర్లలో 3 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన భువీ
  • భువీ ధాటికి హడలిపోయిన ఆఫ్ఘన్ టాపార్డర్
  • భువీ స్వింగ్ కు ముగ్గురు డకౌట్
  • లక్ష్యఛేదనను పేలవంగా ఆరంభించిన ఆఫ్ఘన్
ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ లో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ధాటికి ఆఫ్ఘనిస్థాన్ టాపార్డర్ వణికిపోయింది. భువనేశ్వర్ నిప్పులు చెరిగే బౌలింగ్ కు ఆఫ్ఘన్ 9 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ నాలుగు వికెట్లూ భువనేశ్వర్ ఖాతాలోకే చేరాయి. 

213 పరుగుల భారీ లక్ష్యఛేదనను ఎంతో ధాటిగా ప్రారంభించాలని భావించిన ఆఫ్ఘన్ కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. భువీ స్వింగ్ ను అర్థం చేసుకోలేక ఆఫ్ఘన్ టాపార్డర్ బ్యాట్స్ మెన్ బోల్తాపడ్డారు. భువీ కేవలం 2 ఓవర్లలో 3 పరుగులిచ్చి ఈ నాలుగు వికెట్లు తీయడం విశేషం. అందులో ముగ్గురు డకౌట్ అయ్యారు. 

ప్రస్తుతం ఆఫ్ఘన్ స్కోరు 5.5 ఓవర్లలో 5 వికెట్లకు 20 పరుగులు. అర్షదీప్ ఓ వికెట్ తీశాడు. ఆఫ్ఘన్ జట్టు గెలవాలంటే 86 బంతుల్లో 193 పరుగులు చేయాల్సి ఉంది.


More Telugu News