వెంట‌వెంట‌నే ప‌డిపోయిన 2 కీల‌క వికెట్లు... క‌ష్టాల్లో టీమిండియా

  • రెండో ఓవ‌ర్‌లోనే ఔటైన కేఎల్ రాహుల్‌
  • ఆ త‌ర్వాత ఓవ‌ర్‌లోనే డ‌కౌట్ అయిన కోహ్లీ
  • 5 ఓవ‌ర్ల‌లో ప‌రుగులు చేసిన టీమిండియా
నిల‌వాలంటే గెల‌వాల్సిన కీల‌క‌మైన మ్యాచ్‌లో టీమిండియాకు ఆదిలోనే రెండు వ‌రుస షాక్‌లు త‌గిలాయి. నేడు శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన స్టార్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్ (6) స్వ‌ల్ప స్కోరుకే ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత రాహుల్ స్థానంలో క్రీజులోకి వ‌చ్చిన విరాట్ కోహ్లీ డ‌కౌట్ అయ్యాడు. ఫ‌లితంగా మూడు ఓవ‌ర్లు ముగియ‌క ముందే రెండు కీల‌క వికెట్ల‌ను కోల్పోయిన టీమిండియా క‌ష్టాల్లో ప‌డిపోయింది. 

భార‌త ఇన్నింగ్స్ రెండో ఓవ‌ర్‌లో ఐదో బంతికి లంక బౌల‌ర్ మ‌హేశ్ తీక్ష‌ణకు వికెట్ల ముందే కేఎల్ రాహుల్ దొరికిపోయాడు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తో క‌లిసి టీమిండియా బ్యాటింగ్‌ను ప్రారంభించిన రాహుల్‌.. ఆదిలో దూకుడేమీ ప్ర‌ద‌ర్శించ‌కుండానే జాగ్ర‌త్త‌గా ఆడిన‌ట్టు క‌నిపించినా... రెండో ఓవ‌ర్‌లోనే వికెట్‌ను చేజార్చుకోవ‌డం గ‌మ‌నార్హం. 

ఇక రాహుల్ స్థానంలో వ‌చ్చిన కోహ్లీని శ్రీలంక బౌల‌ర్ దిల్షాన్ మ‌ధుశంక క్లీన్ బౌల్డ్ చేశాడు. మూడు బంతుల‌ను ఎదుర్కొన్న కోహ్లీ ప‌రుగులేమీ చేయ‌కుండానే పెవిలియ‌న్ చేరాడు. ప్ర‌స్తుతం సూర్య కుమార్ యాద‌వ్‌(4)తో క‌లిసి కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (23) జాగ్ర‌త్త‌గా టీమిండియా స్కోరును పెంచే ప‌నిలో ప‌డ్డాడు. క‌డ‌ప‌టి వార్త‌లందేస‌రికి 5 ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త్ 36 ప‌రుగులు చేసింది.


More Telugu News