తెలంగాణ విమోచన దినానికి హాజరు కావాలంటూ కేసీఆర్‌కు లేఖ రాసిన కిషన్ రెడ్డి
- సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినం వేడుకలు
- ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరవుతారన్న కిషన్ రెడ్డి
- మహారాష్ట్ర, కర్ణాటక సీఎంలతో పాటు కేసీఆర్‌ను ఆహ్వానించామన్న కేంద్ర మంత్రి
ఈ నెల 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరిధిలోని పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ శనివారం ఓ లేఖ రాశారు.
తెలంగాణ విమోచన దినం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారని చెప్పిన కిషన్ రెడ్డి... గౌరవ అతిథులుగా హాజరు కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక సీఎంలు ఏక్నాథ్ షిండే, బసవరాజ్ బొమ్మైలను ఆహ్వానించామని తెలిపారు. ఈ మేరకు ముగ్గురు సీఎంలకు లేఖలు రాసినట్లు ఆయన తెలిపారు.