గాడ్సేను ఉరితీసినందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి: అస‌దుద్దీన్ ఒవైసీ

  • బిల్కిస్ బానో అత్యాచారం కేసు దోషుల విడుదల
  • దోషులు సంస్కారం ఉన్న బ్రాహ్మణులన్న గోద్రా ఎమ్మెల్యే
  • కొన్ని కులాల వారు నేరం చేసినా విడుదలవుతారన్న ఒవైసీ
2002లో గుజరాత్ లో చోటు చేసుకున్న బిల్కిస్ బానో అత్యాచారం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న మొత్తం 11 మంది దోషులు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. ఈ కేసులో దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, విడుదలైన దోషులందరూ సంస్కారం ఉన్న బ్రాహ్మణులేనని గోద్రా సిట్టింగ్ ఎమ్మెల్యే రౌల్జీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 

ఈ వ్యాఖ్యలపై ఒవైసీ స్పందిస్తూ... కొన్ని కులాల వారు నేరం చేసినట్టు రుజువయినప్పటికీ విడుదల చేయబడతారని మండిపడ్డారు. మరికొందరికి కులం లేదా మతం ఏదైనా సరిపోతుందని అన్నారు. కనీసం గాడ్సేను దోషిగా నిర్ధారించి ఉరి తీసినందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మోదీ మహిళా సాధికారత గురించి మాట్లాడిన రోజే... గుజరాత్ ప్రభుత్వం బిల్సిస్ బానో కేసు దోషులను విడుదల చేసిందని మండిపడ్డారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఇవన్నీ చేస్తోందని అన్నారు.


More Telugu News