బలహీనపడనున్న వాయుగుండం.. తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

  • పశ్చిమ, వాయవ్య దిశగా ప్రయాణించనున్న వాయుగుండం
  • నిన్న కూడా పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలు
  • ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం
తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 19వ తేదీ వరకు వాతావరణం ఇలానే ఉంటుందని పేర్కొంది. ఉత్తర చత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాయుగుండం వాయవ్య దిశగా ప్రయాణించి నిన్న వాయవ్య చత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్‌ ప్రాంతానికి చేరుకుంది. ఇది క్రమంగా పశ్చిమ, వాయవ్య దిశగా కదిలి బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

దీని ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కాగా, నిన్న కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆసిఫాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.


More Telugu News